రాజమౌళితో సినిమా ఒత్తిడిపై మహేష్ బాబు మరోసారి బిగ్ స్టేట్మెంట్..!

Mahesh Babu

Mahesh Babu : టాలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా చేసిన “సర్కారు వారి పాట” భారీ హిట్ అయ్యి మహేష్ కెరీర్ లో మరో 100 కోట్ల సినిమాగా వెళ్తుంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ మరిన్ని భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ లైనప్ లో నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ సినిమా అలానే నెక్స్ట్ సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమా పక్కన పెడితే రాజమౌళితో సినిమాపై ఎప్పుడు నుంచో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

మరి ఈ సినిమాపై నేషనల్ మీడియాలో మాట్లాడుతూ మహేష్ బాబు బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇది వరకు రాజమౌళితో సినిమా అంటే ఒక 20 సినిమాలు చేసినట్టే అని అందుకోసం ఎన్నాళ్లయినా వెయిట్ చెయ్యొచ్చు అభిమానులు కూడా ఫీల్ అవ్వరని తెలిపాడు.

అయితే ఈసారి ఏమన్నాడంటే రాజమౌళి సినిమా విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు కాకపోతే ఆ సినిమాని ఎప్పుడెప్పుడు స్టార్ట్ చెయ్యాలా అని చాలా ఎగ్జైటింగ్ గా నాకు ఉందని రావాలని కోరుకుంటున్నానని మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. దీనితో ఈ కామెంట్స్ ఈ భారీ ప్రాజెక్ట్ విషయంలో సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.