SSMB29: ఒరిస్సాలో ల్యాండ్ అయిన మహేష్… విలన్ గా స్టార్ హీరో… ఫోటోలు వైరల్!

SSMB29: పాన్ ఇండియా స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా హైదరాబాద్ సమీపంలోనే అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా సెట్ వేసి షూటింగ్ పనులను జరుపుకున్నారు. ఇలా హైదరాబాదులో కొన్ని షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ప్రస్తుతం అవుట్ డోర్ షూటింగ్ పనుల నిమిత్తం ఒరిస్సా వెళ్లినట్టు తెలుస్తోంది.

ఒరిస్సాలోని దట్టమైన అటవీ ప్రాంతం కోరాపుట్ లో ల్యాండ్ అయ్యారు. మహేష్ బాబు ఒరిస్సా పోలీసులతో కరచాలనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ బాబుతో పాటు మరో హీరో కూడా ఇక్కడ కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నారు.

గత కొంతకాలంగా ఈ సినిమాలో పృథ్వీరాజ్ భాగమవుతారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఈయన స్పందిస్తూ ప్రస్తుతం ఇంకా ఈ సినిమా చర్చల దశలలోనే ఉందని ఇంకా ఫైనల్ కాలేదని తెలిపారు. తాజాగా ఈయన కూడా మహేష్ బాబుతో కలిసి ఒరిస్సా పోలీసులకు కరచాలం చేస్తూ ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సినిమాలో పృథ్వి నటించబోతున్నారని స్పష్టమవుతుంది.

ఒరిస్సాలో ఈ సినిమా చుట్టూ అడవులు, కొండలు ఉన్న ప్రాంతంలో ఈ చిత్రానికి సంబంధించిన సెట్స్ కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతున్నారు.