తల్లి చివరి కోరిక తీర్చలేకపోయా అని కుమిలిపోతున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితం మహేష్ బాబు కి ఏంటో ఆప్తుడైన తన అన్న రమేష్ బాబు అకాల మరణం చెందాడు. ఆ డిప్రెషన్ నుండి బయటపడకముందే తాను ఎంతగానో ప్రేమించే తన తల్లి శ్రీమతి ఇందిరా దేవి కూడా చనిపోయారు.

చాలా సందర్భాల్లో మహేష్ బాబు తన తల్లి, అన్నల గురించి చాలా గొప్పగా చెప్పాడు. తన తండ్రి కృష్ణ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంటె, తన అన్న రమేష్ బాబు తండ్రిలా తనను చూసేవాడిని, అలాగే తన తల్లి అంటే దేవుడితో సమానమని మహేష్ బాబు అనేక సందర్భాల్లో అన్నాడు.

తనకు ఎంతో ఇష్టమైన ఇద్దరూ దూరమవడంతో మహేష్ బాబు చాలా బాధలో ఉన్నాడు. అయితే ఇందిరాదేవి ఓ కోరిక తీర‌కుండానే క‌న్నుమూశార‌ని కొన్ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందిరాదేవి చ‌నిపోయేలోపు మహేష్ బాబు కూతురు సితార ఓనీల ఫంక్ష‌న్ చూడాల‌ని అనుకున్నార‌ట‌. ఆ విష‌యాన్ని మ‌హేశ్ కు కూడా చెప్పార‌ట‌. కానీ ఆ కోరిక తీర‌కుండానే ఇందిరాదేవి లోకాన్ని విడిచివెళ్ల‌డం బాధాక‌రం.