Covid Negative : కరోనా స్టార్స్ : తాజాగా కోవిడ్ నుంచి తప్పించుకున్న మహేష్ హీరోయిన్.!

Covid Negative : ఈసారి కూడా ప్రపంచ నలుమూలల్లో కరోనా తాండవం మామూలుగా లేదని చెప్పాలి. అలాగే ఇదే సమయంలో భారదేశంలో కూడా జస్ట్ రోజుల వ్యవధిలోనే లక్షలాది కేసులు నమోదు అవ్వడం షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టార్ నటులు కూడా కరోనా పాజిటివ్ అవ్వడం మరింత షాక్ ఇచ్చింది.

అయితే ఈసారి కేసులు భారీ ఎత్తున పెరుగుతున్నా తర్వాత మునుపటిలా ఎక్కువ స్థాయి మరణాలు తీవ్ర అనారోగ్యం వంటివి చోటు చేసుకోకపోవడం దేశ ప్రజల్లో కాస్త ఉపశమనం కలిగించింది అని చెప్పొచ్చు. మరి ఈ వ్యవధిలోనే చాలా మంది నటులు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన వారు నెగిటివ్ అవుతూ వస్తున్నారు.

ఇక ఈరోజు అలా మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా నుంచి కోలుకుంది. గత కొన్ని రోజులు కితమే పాజిటివ్ అయ్యిన కీర్తీ ఈరోజు తాను నెగిటివ్ అయ్యినట్టుగా శుభవార్తని తెలియజేసింది. అలాగే ఇప్పుడు అందరికీ సంక్రాంతి పొంగల్ విషెష్ తెలియజేసింది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సర్కారు వారి పాట” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఈమె ఇంట్రెస్టింగ్ పాత్ర చేస్తుంది. అలాగే ఈ కొన్ని రోజుల్లో సెట్స్ కి చేరుకోనుంది.