Sarkaru Vaari Paata : లేటెస్ట్ – “సర్కారు వారి పాట” నుంచి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్ బాబు.!

Sarkaru Vaari Paata : టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” కోసం తెలిసిందే. హిట్ దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాని అదిరే హంగులను మేళవించి మహేష్ ఫ్యాన్స్ ని ట్రీట్ ఇచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు థమన్ ఎస్ ఇచ్చిన ఫస్ట్ సాంగ్ “కళావతి” సూపర్ హిట్ కాగా రెండో సాంగ్ పై కూడా సాలిడ్ ఎక్స్ పెక్టేషన్స్ నమోదు అయ్యాయి. “పెన్నీ” అనే టైటిల్ తో అనౌన్స్ చేసిన ఈ సాంగ్ నుంచి ఇప్పుడు చిత్ర బృందం ఆసక్తికర ప్రోమో ని రిలీజ్ చేసారు.
అయితే ఈ ప్రోమో మాత్రం సూపర్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సాంగ్ లో మహేష్ లుక్స్ ఒక హైలైట్ అనుకుంటే ఈ సాంగ్ ని స్పెషల్ గా మహేష్ ముద్దుల కూతురు సితార ఘట్టమనేనితో చేయించడం ఆసక్తిగా మారింది. అలాగే తన డాన్స్ స్టెప్పులు గాని సాంగ్ లొకేషన్స్ కానీ సాంగ్ లో బాగున్నాయి.
అంతే కాకుండా సాంగ్ ని థమన్ కూస చాలా స్టైలిష్ గా కంపోజ్ చేసాడని అభిమానులు అంటున్నారు. దీనితో రేపు రిలీజ్ అయ్యే ఫుల్ సాంగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాని మే 12న రిలీజ్ చేస్తున్నారు.