ఫ్యాన్స్ ని ఈ విషయంలో డిజప్పాయింట్ చేస్తున్న మహేష్ బాబు.??

mahesh babu : ఏ ఇండస్ట్రీ లో అయినా కూడా తమ హీరోల అభిమానులు ఎప్పటికప్పుడు తమ హీరోలను కాస్త కొత్తగా కొత్త స్క్రిప్ట్స్ మేకోవర్స్ తో రావాలని చూస్తుంటారు. కానీ ఎప్పుడు ఒకటే ఫార్మాట్ లో వస్తే మాత్రం సినిమా హిట్ అయ్యినా కూడా అభిమానులు డిజప్పాయింట్ అవ్వక తప్పదు. ఇప్పుడు అదే పరిస్థితిలో మన టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు అభిమానులు ఉన్నారట.

మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” అంతా బాగానే ఉంది కానీ ఒక్క విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఎందుకో ఇంకా కంప్లీట్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. మహేష్ గత సినిమాలలో చూసినట్టు అయితే చాలా వరకు అన్నీ సందేశాత్మక చిత్రాలే కనిపిస్తున్నాయి.

దీనితో మహేష్ నుంచి ఒక ఫుల్ లెంగ్త్ మాస్ డ్రామాలు మిస్ అవుతున్నాయి. పోనీ సర్కారు వారి పాట తో అదేదో తీరేలా ఉంది అనుకుంటే ఇక్కడ కూడా ఒక సందేశం ఉంది. దీనితో మహేష్ ఈ మెసేజ్ లు ఇవ్వడం ఆపి తమకంటూ ఒక దూకుడు, పోకిరి లాంటి ఫుల్ మీల్స్ ఎపుడు పెడతాడా అని అంతా అనుకుంటున్నారు.

ఈ విషయంలో అయితే మహేష్ మాత్రం డిజప్పాయింట్ చేస్తున్నాడనే చెప్పాలి. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ మరియు రాజమౌళి సినిమాలు అయితే కాస్త వాటి నుంచి బ్రేక్ ఇవ్వొచ్చని చెప్పాలి. ఇంకా చూసినట్టు అయితే మహేష్ త్రివిక్రమ్ సినిమాకి గాను ఈ జూలై నుంచి రంగంలో దిగనున్నాడు.