Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు రివ్యూ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రేక్షకులు ఈ సినిమాకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు హౌస్ఫుల్ బోర్డులు కూడా పెడుతున్న విషయం తెలిసిందే. ఇలా ఈ సినిమా వెంకటేష్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా తాజాగా మహేష్ బాబు చూసారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇది పండుగలాంటి సినిమా వెంకటేష్ సార్ నటన సూపర్. నా దర్శకుడు అనిల్ రావిపూడిని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. వరుస బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నాడు. ఇక ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి వారి పాత్రలకు ప్రాణం పోసారని తెలిపారు. ఇక బుల్లి రాజు పాత్రలో నటించిన కుర్రాడి నటన అద్భుతమని తెలిపారు. ఇలా ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు పరిచయం చేసి మంచి సక్సెస్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం టీం అందరికీ శుభాకాంక్షలు అంటూ మహేష్ పోస్ట్ చేశారు
ఈ విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మహేష్ బాబు స్పందించడంతో పెద్దోడి సినిమాకు చిన్నోడు బ్లాక్ బాస్టర్ రివ్యూ ఇచ్చారు అంటూ నేటిజన్స్ కామెంట్లో చేస్తున్నారు. ఇక వెంకటేష్ మహేష్ బాబు మధ్య మంచి బాండింగ్ ఉంది వీరిద్దరూ కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించారు ఇందులో వీరిద్దరూ పెద్దోడు చిన్నోడు పాత్రలలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా సమయం నుంచి మహేష్ బాబుతో తనకు చాలా మంచి బాండింగ్ ఉందనీ, మహేష్ బాబుని చూస్తే నిజంగానే నా చిన్న తమ్ముడు అనే భావన నాకు కలుగుతుంది అంటూ వెంకటేష్ సైతం మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.