టాలీవుడ్ హీరోల్లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడ ఒకరు. గత సినిమా వరకు కూడ ఆయన రెమ్యునరేషన్ 40 కోట్లకు పైమాటే. అయితే పారితోషకంతో పాటు మహేష్ సినిమా లాభాల్లో కూడ షేర్ తీసుకునేవారు. ఏదైనా ఒక రీజియన్లో జరిగే బిజినెస్లో వచ్చే లాభాల్లో కొంత వాటా ఇవ్వాలని అగ్రిమెంట్ రాసుకునేవారు. అలా ఒక్కొక సినిమాకు 50 కోట్ల వరకు ముట్టేది ఆయనకు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సినిమా చిన్నదైనా, పెద్దదైనా విడుదలయ్యే వరకు క్లారిటీ లేదు. సినిమా హాళ్లు తెరుచుకునే పరిస్థితి ఉన్నా కూడ డిస్ట్రుబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సినిమాల విషయంలో వెనకాడుతున్నారు.
అన్ని విషయాల్లోనూ సందిగ్ధం, ఆలస్యం. సినిమా బిజినెస్లో వాటా ఉన్న వారంతా కంగారుపడాల్సిందే. అందుకే మహేష్ బాబు ఈ తలనొప్పి అంతా తనకు ఎందుకని వాటాల జోలికి వెళ్లకుండా ఏదైనా డబ్బు రూపంలోనే తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు ఇదే పద్ధతిని రెమ్యునరేషన్ తీసుకున్నారట ఆయన. వాటా లేదు కాబట్టి 55 కోట్ల రూపాయల భారీ మొత్తం పుచ్చుకున్నాడట మహేష్. ఇక మీదట కూడ ఇలాగే తీసుకుంటారట. ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చేస్తున్న మహేష్ ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా అది పూర్తయ్యాక ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనన్నాడు.