మహేష్ బాబు ప్లాన్స్ అన్నీ రద్దు చేసుకున్నాడు

Mahesh Babu cancel all his plans
Mahesh Babu cancel all his plans
 
మే 31st సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఆ రోజున మహేష్ బాబు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి.  టీజర్, ఫస్ట్ లుక్, కొత్త సినిమా ప్రకటనలు ఇలా అభిమానుల కోసం ఏదో ఒక విశేషమైతే ఉంటుంది. కానీ ఈసారి అవేవీ ఉండవు. ‘సర్కారు వారి పాట’ ప్రచార చిత్రం విడుదలవుతుందని అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు.  కొందరైతే మహేష్, త్రివిక్రమ్ సినిమా లాంచ్ ఉంటుందని ఆశించారు కానీ అవేవీ లేవు. దేశంలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి అప్డేట్స్ అవ్వడం సమంజసం కాదనుకున్న మహేష్ అన్ని ప్లాన్స్ విరమించుకున్నారు.  
 
సో..ఈసారి కృష్ణగారి పుట్టినరోజు మహేష్ నుండి ఎలాంటి విశేషం లేకుండానే గడిచిపోనుంది.  ఎలాంటి ట్రీట్ లేకపోవడం నిరాశ కకిగించే విషయమే అయినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇదే సరైన డెసిషన్ అని అంటున్నారు అభిమానులు.  ఇకపోతే మహేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మేజర్’ సినిమా విడుదల కూడ వాయిదాపడింది. ప్రస్తుతం నిలిచిపోయి ఉన్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణను జూన్ చివరలో లేదా జూలై మొదట్లో రీస్టార్ట్ చేయాలని చూస్తున్నారు మహేష్. కోవిడ్ లాక్ డౌన్ రీత్యా ఎదురవుతున్న ఆటంకాలు మూలాన ఈ ఏడాది మహేష్ నుండి కొత్త సినిమా విడుదల ఏదీ లేదు.  2022 సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ విడుదలను ప్లాన్ చేస్తున్నారు.