మేకర్స్ సరికొత్త ఆలోచనలతో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా చారిత్రాత్మక చిత్రాలు లేదంటే పీరియాడికల్ మూవీస్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఇలాంటి చిత్రాలు రూపొందుతుండగా, ఆ జానర్‌లోనే మరి కొన్ని సినిమాలు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. అయితే మహేష్ బాబు హీరోగా రామాయణ ఇతివృత్తం ఆధారంగా అల్లు అరవింద్, మధు మంతెన హిందీలో భారీ బడ్జెట్‌తో ఓ సినిమా నిర్మించనున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి.
‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారీ, ‘మామ్’ దర్శకుడు రవి ఉడయార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నాడని, రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సీత పాత్రలో దీపికా పదుకొణే నటించనున్నట్టు వినికిడి. దాదాపు 1500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ వార్తతో సినిమాపై భారీ అంచనాలే పెరగగా, ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు మహేష్ బాబు-రాజమౌళి సినిమాకు సంబంధించి కూడా ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది.
దర్శక ధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా ఉండనుందట. ఆఫ్రికన్ అడవుల్లో చిత్రీకరణ జరిపే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని టాక్. 2022 చివరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు టాక్. ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. దుబాయ్‌లో చిత్ర షూటింగ్ జరుగుతుండగా, ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ తర్వాత మహేష్ క్రేజీ సినిమాలతో అలరించనున్నాడు.