SSMB 29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సుమారు 1000 కోట్ల బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా సెట్ వేసి ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశారు.
ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్ర బృందం మొత్తం ఒరిస్సా వెళ్లిన సంగతి తెలిసిం.దే ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలు కూడా బయటకు రాలేదు కానీ మహేష్ బాబు లుక్, ఆయన వర్కౌట్స్ చూస్తుంటే మాత్రం రాజమౌళి ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా మహేష్ బాబుకు మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావటం విశేషం. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే మహేష్ బాబు చేసే సినిమా పేర్లు మాత్రమే కాకుండా సినిమాలలో ఆయన పాత్ర పేరుకు కూడా ఎంతో మంచి క్రేజ్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాలో మహేష్ బాబు పాత్రకు సంబంధించి ఒక పేరు బయటకు వచ్చింది.
రాజమౌళి సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి మరి మహేష్ బాబుని ప్రేక్షకులు రుద్రల యాక్సెప్ట్ చేస్తారా… లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్న విషయం తెలిసిందే ఈయన కూడా ఇటీవల ఒరిస్సా వెళ్ళిన సంగతి తెలిసిందే.