మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల “ధమాకా” నుండి డు డు సాంగ్ విడుదల .

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ధమాకా నుండి విడుదలైన డు డు సాంగ్ ప్రోమో పాటపై అంచనాలు పెంచింది. ఈ రోజు పూర్తి పాట విడుదలైయింది. భీమ్స్ సిసిరోలియో ఈ పాటని మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే ఎక్స్ టార్డినరీ మాస్ నెంబర్ గా కంపోజ్ చేశారు.

ఈ పాటలో రవితేజ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్, స్వాగ్ మైండ్ బ్లోయింగా వున్నాయి. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ రోల్ ని తెలియజేస్తోంది. ఈ పాటని పృధ్వీ చంద్ర ఫెంటాస్టిక్ గా ఆలపించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.

డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

తారాగణం: రవితేజ, శ్రీలీల

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్.

YouTube video player