ప్యూర్ నేచర్ లో.. పర్ఫెక్ట్ నేచరుల్ సినిమా ‘@లవ్’ !

@love telugu movie is tribal drama

 

ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న విభిన్న చిత్రం  ‘@లవ్’.   శ్రీ నారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో  ఫస్ట్ లుక్ ను   టాలెంటెడ్ డైరెక్టర్  నాగ్ అశ్విన్  లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.   గిరిజన నేపథ్యంలో  స్వచ్ఛమైన ప్రేమ కథతో  రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ జనరేషన్ ఎప్పుడు చూడని న్యూ ఏజ్డ్ బ్యాక్ డ్రాప్ లో.. ప్యూర్  నేచర్ లో జరిగిన  ఓ పర్ఫెక్ట్  నేచరుల్ ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ సినిమా సాగుతుందట.  
@love telugu movie is tribal drama

@love telugu movie
ఇక  ఈ  “@లవ్ ” చిత్రం పాటలను టిప్స్ మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది. అవి సినీప్రియులని అమితంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి. పైగా  ఇప్పటివరకు ప్రేక్షకులు వినని తెలుగు యాసని, ఇంట్రడక్షన్ క్లిప్స్ ద్వారా  సోషల్ మీడియాలో పరిచయం చేస్తుండటంతో అవన్నీ ఎంతో ఆశక్తిని రేకెత్తిస్తూ వైరల్ అవుతున్నాయి. మంచి సినిమా రావడం  లేదు అని బాధ పడేవారికి  ఈ సినిమా మంచి ఆప్షన్.  
 
గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించే  సినిమా ఇది. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని  ఈ సినిమాలో శ్రీ నారాయణ చూపించిన విధానం అద్భుతంగా ఉంది. అందుకే,  ఈ చిత్రం ఓ కొత్త అనుభూతిని పంచుతుంది. ఇక ఈ చిత్రాన్ని TMS బ్యానర్ తో ప్రీతమ్ ఆర్ట్స్ &SN క్రియేషన్స్ సంయుక్తంగా మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ నిర్మించారు. డిసెంబర్ లో రానున్న ఈ  @లవ్  ప్రేక్షకులను ఆకర్షించే చిత్రంగా నిలిచే ఛాన్స్ ఉంది.