పాకిస్తాన్ మిడుతల దండు ఇప్పుడు తెలుగు రాష్ర్టల్లో హాట్ టాపిక్. ఇప్పటికే తెలంగాణ సహా ఏపీలో కొన్ని జిల్లాల్లో ఈ మిడుతలు దర్శనమిస్తున్నాయి. పంటలిప్పుడు అధికంగా లేవు కాబట్టి రైతులు ప్రస్తుతానికి సేఫ్. కానీ పంటలు మొదలైన తర్వాత మిడుతల దండు దాడిచేస్తే పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అర్ధం కానీ ప్రశ్న. ఇప్పటికే కొన్ని మార్గాలు సిద్దం చేసుకుని రెడీగా ఉన్నారు. దాడి ఎక్కువైతే డీజేలు పెద్ద పెద్ద సౌండులతో పెట్టి….ఎర్రటి చొక్కాలేసుకుని వాటిని బెదరగొట్టమని…అవసరమైన క్రిమిసంహారక మందులు చల్లమని ప్రభుత్వాలు చెప్పాయి. ఆ విషయం పక్కనబెడితే మిడుతల బిర్యానీ కూడా గొప్ప రుచిగా ఉందని తేలింది.
పాకిస్తాన్ వాసులు ఇప్పటికే మిడుదల్ని బిర్యానీగా చేసుకుని ఆరగించేసారు. దీంతో పాక్-ఇండియా బోర్డర్ అయిన రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు మిడుతల బిర్యానికి ఫేమస్ గా మారిపోయాయిట. చికెన్ బిర్యానీలా మసలాగట్రా దట్టించి బిర్యానీ రైస్ లో వేసి ఉడికిస్తే ఆ టేస్టే వేరుగా ఉందని అంటున్నారు. ఒక్కో ప్లేటు 200 రూపాయలకు అమ్ముడుపోతుంది. మిడుతల దాడిని ఎలా భరించాలిరా? అనుకున్న వాళ్లకి ఇప్పుడు ఇదో చక్కని దారిలో మారిపోయిందన్న కామెంట్లు సోషల్ మీడియాలో పడుతున్నాయి. ఇక హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్దిగాంచింది. చికెన్, మటన్ బిర్యానీలు ప్రపంచంమొత్తం గుమగులాడిస్తుంటాయి.
బిర్యానీలో ఇంకా డిఫరెంట్ రుచులు ట్రై చేయడం హైదరాబాద్ చెఫ్ ల ప్రత్యేకత. మరి ఓసారి మిడుతల బిర్యానీ కూడా ట్రై చేస్తే పోలే. అసలే మిడుతల దాడితో రైతులు ఆందోళ చెందుతున్నారు. అలాంటి వాళ్లకు మిడుతల నుంచి ఉపశమనమైనా దొరుకుతుంది! అన్న కామెంట్లు పడుతున్నాయి. ఆమధ్య హైదరాబాద్ లో ఓ ప్రముఖ రెస్టారెంట్ కుక్కల్ని కోసి బిర్యానీ చేసింది. బిర్యానీ ప్రియులు దాన్నిమటన్ బిర్యానీ అనుకుని లొట్టలేసుకుని మరీ లాగించేసారు. తిన్నాక తెలిసింది అది కుక్క బిర్యానీ అని. దీంతో ఆరెస్టారెంట్ పై కేసు నమోదు చేసి మూయించారు. ఇక చైనా వాసులు మిడుతల్ని ఇప్పటికే వేపుకుని తినేస్తున్నారు. అయినా వాళ్లు తినని జంతువేముంది? కీటకం ఏదుంది? అలా కక్కుర్తి పడే ప్రపంచ దేశాలకు కరోనా అంటించారు.