Liger : తెలుగు స్టేట్స్ లో భారీ బిజినెస్ అట.. డిస్ట్రిబ్యూటర్ ఎవరో తెలుసా.!

Liger Record Theatrical Business

Liger Record Theatrical Business : మన తెలుగు సినిమా నుంచి ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్న పలు భారీ పాన్ ఇండియా సినిమాల్లో సెన్సేషనల్ స్టార్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “లైగర్” సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు కూడా ఉన్నాయి. మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకొని ఈ ఏడాదిలో విడుదల కి సిద్ధంగా ఉంది.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా బిజినెస్ డీల్ మన తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ అయ్యిపోయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ఏకంగా 70 కోట్లకి బిజినెస్ జరిగింది అట. ఈ డీల్ అంతటినీ కూడా ఒకే డిస్ట్రిబ్యూటర్ కొనుగోలు చేశాడట. మరి ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా మరెవరో కాదు తాజాగా “ఆచార్య” నైజాం హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను.

ఈ సినిమాకి తాను ఎలా లేదన్న భారీ నష్టం చూడడం ఖాయం. ఇప్పుడు లైగర్ 70 కోట్లు మరి ఈ సినిమాకి ఏమవుతుందో చూడాలి. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కగా ఛార్మి మరియు ధర్మ ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం అందించా