విజయ్ దేవరకొండ రష్మిక మందాన్న కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలుంటాయి. ఇక వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి అందరూ షాక్ అయ్యేవారు. ప్రేమలో ఉన్నారేమో అనే అనుమానం కలిగేంతలా వెండితెరపై మ్యాజిక్ చేసేశారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో వీరి నటనకు, కాంబినేషన్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ ఇద్దరూ మంచి జంటగా పేరు సంపాదించుకున్నారు.
విజయ్ దేవరకొండ ఫ్యామిలీతోనూ రష్మిక మందాన్న క్లోజ్‌గా ఉంటుంది. మొన్నామధ్య విజయ్ దేవరకొండ తల్లి బర్త్ డే సందర్బంగా రష్మిక చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. తాజాగా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను విడుదల చేశారు. లైగర్ అంటూ విడుదల చేసిన పోస్టర్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. అయితే దీనిపై తాజాగా రష్మిక మందాన్న ట్వీట్ చేసింది.
ఎంతో గర్వంగా ఉంది.. పోస్టర్ అదిరిపోయింది.. ఇలాంటి మాస్టర్ పీస్‌ను చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నాను.. విజిల్స్ వేస్తూ డ్యాన్స్ చేస్తూ రచ్చ చేసేందుకు ఎదురుచూస్తున్నాను.. నా స్వీటెస్ట్ బీస్ట్స్‌కు ఆల్ ది బెస్ట్.. అంటూ రష్మిక ట్వీట్ చేసింది. దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ… అవును నీలా చాలా థియేటర్లో అందరూ రచ్చ చేస్తారు.. ప్రామీస్‌గా చెబుతున్నాను.. అది నీకు తెలుసు ఎందుకంటే నువ్ కొంత స్టఫ్ (సినిమా)ను చూశావ్ అంటూ అసలు విషయం చెప్పేశాడు.