‘మంచు’ కాంపౌండ్‌లో ఆ ‘పొడుగు’ సుందరి.!

 
‘జాతి రత్నాలు’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ఫరియా అబ్ధుల్లా. మాంచి పొడుగరి అయిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే యూత్ మనసులు కొల్లగొట్టేసింది. యూత్‌లోనే కాదు, ఇండస్ర్టీని శైతం విశేషంగా ఆకర్షించింది.
 
అయితే, కాస్త పొడుగు కావడంతో, పొడుగ్గా ఉన్న హీరోలకు మాత్రమే ఈ ముద్దుగుమ్మ జోడీ అవుతుందని భావించారంతా. ఆ కారణంగానే ‘జాతి రత్నాలు’ తర్వాత స్లోగా అమ్మడికి అవకాశాలు దక్కుతున్నాయి. లేటెస్టుగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించిన ఫరియా అబ్ధుల్లా మరో బంపర్ ఛాన్స్ కొట్టేసిందిప్పుడు.
 
ఆరడుగుల ఆజానుబాహుడైన మంచు విష్ణు సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు కథానాయకుడుగా తెరకెకక్కుతోన్న ‘ఢీ అండ్ ఢీ – డబుల్ డోస్’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడే కన్ఫామ్ చేశాడు. ‘జాతిరత్నాలు’ సినిమాలోని ఫరియా కామెడీ టైమింగ్ చూసిన శీను వైట్ల తన సినిమాకి హీరోయిన్‌గా ఈ జనరేషన్‌కి తగ్గట్లుగా ఫరియా చక్కగా సరిపోతుందని భావించి ఆమెని సెలెక్ట్ చేశాడట.