పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి లీకుల సెంటిమెంట్ …ఇది ఫ్యాన్స్ పనే ..?

పవన్ కల్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “వకీల్ సాబ్” అన్న సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. బోనీకపూర్ సమర్పిస్తున్నాడు. శృతి హాసన్ కీలక పాత్ర లో కనిపించబోతుండగా యంగ్ బ్యూటిస్ నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ నటిస్తున్నారు. అలాగే సీనియర్ నరేష్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా బాలీవుడ్ లో పింక్ గా అమితాబ్ బచ్చన్, తమిళంలో నేర్కొండ పార్వై గా అజిత్ నటించారు.

First look of Pawan Kalyan-starrer 'Vakeel Saab' revealed | The News Minute<top>

రెండు భాషల్లో ఈ సినిమా కి 100 కోట్ల పైగానే వసూళ్ళు వచ్చాయి. ఇప్పుడు అదే సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తుండటంలో టాలీవుడ్ లో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ అలాగే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక రీసెంట్ గా జరిగిన జీహెచెంసీ ఎలక్షన్స్, నిహారిక పెళ్ళి కారణంగా కాస్త గ్యాప్ వచ్చిన వకీల్ సాబ్ బాలెన్స్ షూటింగ్ ని కంప్లీట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ మళ్ళీ సెట్ లో అడుగుపెట్టాడు. గత రెండు రోజులుగా వకీల్ సాబ్ షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా జరుగుతోంది.

అయితే ఫ్యాన్స్ మళ్ళీ అదే లీకుల సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారని టాక్ మొదలైంది. అత్తారింటికి దారేది సినిమా దాదాపు గంట సినిమా లీకైన సంగతి తెలిసిందే. అలాగే అజ్ఞాతవాసి సినిమా విషయంలో కూడా జరిగింది. అయితే ఇదంతా ఫ్యాన్స్ పనే అన్న టాక్ ఉంది. సినిమా రిలీజ్ కి ముందు ఇలా లీకైతే సినిమా సూపర్ హిట్ అన్న సెంటిమెంట్ ని మళ్ళీ ఫ్యాన్స్ ఫాలో అవుతూ సెట్ నుంచి వకీల్ సాబ్ ఫొటోస్ ని లీక్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే ఇక్కడ ఫ్యాన్స్ ఒక లాజిక్ మర్చిపోయారు. లీకైన సినిమాలలో అత్తారింటికి దారేది సూపర్ హిట్ అయితే అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్ గా మిగిలింది.