అమీర్ ఖాన్ నుంచి చాలా నేర్చుకున్నా…నాగచైతన్య

lal పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చెన్నైలో కూడా ఈ సినిమా తమిళ వెర్షన్ ట్రైలర్ లాంచ్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఉదయనిది స్టాలిన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ అమీర్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ గురించి నాగచైతన్య మాట్లాడుతూ ఆయన సినిమాలో నాకు అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉంది అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఇకపోతే నటుడు అమీర్ ఖాన్ తో కలిసి నటించడం వల్ల ఎన్నో విషయాలను తాను తెలుసుకున్నానని చైతన్య వెల్లడించారు.

అమీర్ ఖాన్ గారు పెద్ద డిక్షనరీ వంటి వారు ఆయన వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అలాంటి వ్యక్తితో తనకు నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈయన తెలిపారు.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తనకు అమీర్ ఖాన్ అంటే ఎంతో ఇష్టమని ఆయన తనకు అభిమాన నటుడు అంటూ పేర్కొన్నారు. ఇక ఈ సినిమాని తమిళ వర్షన్ లో కూడా విడుదల చేయమని అమీర్ ఖాన్ గారిని కోరగానే వెంటనే తమిళ వెర్షన్ లో విడుదల చేయడానికి ఒప్పుకున్నారంటూ ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.