ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి తన రెండు సినిమాలతో అయితే ఆడియెన్స్ ని పలకరించగా అందులో దర్శకుడు కొరటాల శివతో చేసిన మెగా మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” భారీ డిజాస్టర్ కాగా మెగాస్టార్ నటించిన మరో చిత్రం దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రం “గాడ్ ఫాదర్” మంచి హిట్ గా నిలిచింది.
ఇప్పటికీ కూడా మంచి వసూళ్లు ఈ సినిమా అందుకుంటుండగా నెక్స్ట్ అయితే మెగాస్టార్ నటిస్తున్న చిత్రాలు కూడా కొన్ని సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో దర్శకుడు తెరకెక్కించిన “చిరు 154” సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య అనే మాస్ రోల్ చేస్తుండగా తాజాగా ఈ సినిమా నుంచి లీక్ షాక్ తగిలింది.
కొన్ని సాలిడ్ వర్కింగ్ స్టిల్స్ అయితే బయటకి వచ్చేసాయి. దీనితో ఈ లీక్స్ పై మెగాస్టార్ కాంపౌండ్ నుంచి వెంటనే రిక్వెస్ట్ వచ్చింది. చిరు 154 సినిమా నుంచి అనుకోని విధంగా ఈ స్టిల్స్ కొన్ని లీక్ అయ్యాయని దయచేసి వాటిని ఎవరూ షేర్ చెయ్యొద్దని అయితే వారు చెప్తున్నారు.
ఒకవేళ షేర్ చేసినట్టు అయితే లీగల్ గా కాపీ రైట్ సమస్యలు ఎదుర్కొంటారని అందుకే ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఎదురు చూడాలి అని విన్నవించుకున్నారు. దీనితో అయితే ఈ లీక్స్ మాత్రం ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
Un Fortunately few working stills of Mega Star @KChiruTweets garu's #Mega154 got leaked and speculated on SM,Requesting all Mega Fans kindly Please delete those Pics from your handles, account's may affect due to copy right issue,Thx in advance
Just wait for the official FL💣
— SivaCherry (@sivacherry9) October 10, 2022