Sarkaru Vaari Paata : లీక్ షాక్ : “సర్కారు వారి పాట” ఫస్ట్ సాంగ్ ని లీక్ చేసేసింది అతడేనట.!

Sarkaru Vaari Paata :  ఇండస్ట్రీలో తెరకెక్కే ప్రతి సినిమా కూడా రిలీజ్ అయ్యే వరకు అది తల్లి కడుపులో ఉండే బిడ్డతో సమానమే. ఎంతో మంది పని చేసి ఒక చిత్రాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఒక డేట్ కి సినిమాని అందించి ఆడియెన్స్ కి ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ ని అందిస్తారు. అయితే ఇలా ఎంతో కస్టపడి చేసే వారి శ్రమను కొందరు యిట్టె నాశనం చేసేస్తారు.
మొదట్లో అంటే సినిమా రిలీజ్ అయ్యాక పైరసి లు వచ్చేసేవి. కానీ ఇప్పుడో సినిమా ఆల్రెడీ షూట్ జరుగుతూ ఉంటే ఇలా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చేరింది.
దర్శకుడు పరశురామ్ పెట్ల తో చేస్తున్న “సర్కారు వారి పాట” నుంచి అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సాంగ్ ని చిత్ర బృందం ఈ 14న రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. కానీ ఊహించని రీతిలో ఆ సాంగ్ 12నే బయటకు వచ్చేసింది. దీనితో ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ అయితే ఎంతో ఎమోషనల్ అయ్యిపోయాడు.
నిర్మాతలు కూడా ఆ లీక్ చేసిందో ఎవరో వదలం అని కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఇండస్ట్రీలో అసలు ఆ లీక్ చేసింది ఎవరో దొరికేసినట్టు తెలుస్తుంది. ఆ పని చేసింది మరెవరో కాదట ఈ సినిమాకి దర్శకుని పక్కనే ఉండే అసిస్టెంట్ డైరెక్టర్స్ లో ఒకడు చేసాడట.
మరి అతడిని పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ లీక్ కి తగ్గ శిక్ష కూడా అతడికి పడేలా చూస్తారని సినీ వర్గాల్లో టాక్. ఫైనల్ గా అయితే ఈ సాంగ్ ని మేకర్స్ ఈ రోజే రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చేసారు.