Laya: భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన నటి లయ… బోలెడంత డబ్బుందంటూ కామెంట్స్!

Laya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి లయ ఒకరు. ఈమె ఒకానొక సమయంలో వరుస హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రముఖ డాక్టర్ ను వివాహం చేసుకున్న లయ పెళ్లి తర్వాత అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.

ఇలా అమెరికా వెళ్లడంతో ఈమె సినిమా ఇండస్ట్రీకి కూడా దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కాలంలో లయ ఎక్కువగా ఇండియాలోనే ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇండియాలో ఉండటమే కాకుండా తిరిగి సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యారు అలాగే తన కుమార్తె కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం లయ కుమార్తె బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న అఖండ 2 లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

ఇక లయ కూడా పలు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని సంవత్సరాలపాటు భర్త పిల్లలతో కలిసి అమెరికాలో ఉన్న లయ ఇప్పుడు తన భర్తను వదిలిపెట్టి పిల్లలతో పాటు ఇండియాలో ఉండటంతో ఈమె తన భర్తతో విడాకులు తీసుకొని విడిపోయారని అందుకే ఇండియాకు వచ్చి తిరిగి సినిమా ప్రయత్నాలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా లయ స్పందించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తనకు సినిమాలలో చాలా ఆసక్తి ఉండటం వల్లే తిరిగి ఇండియా వచ్చి సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. అయితే మా ఆయన అమెరికా నుంచి ఇండియా రావడం కుదరదు అక్కడ చాలా క్లినిక్స్ ఉన్నాయి వాటి వ్యవహారాలన్నీ చూసుకోవటానికి సరిపోతుంది. అందుకే ఇండియా రావడం లేదు.

ఇలా మా ఆయన అక్కడుండి నేను ఇక్కడ ఉంటే మేమిద్దరం విడాకులు తీసుకొని విడిపోయినట్టు కాదు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. అలాగే మాకు అమెరికాలో వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అంత డబ్బు మా దగ్గర లేదని కాకపోతే ఏదైనా కొనుక్కోవాలి అంటే క్షణం ఆలోచించకుండా కొనుక్కొనే అంత డబ్బు మాత్రం మా దగ్గర ఉంది అంటూ లయ విడాకుల రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.