రాజమౌళి, మహేష్ బాబు సినిమా పై లేటెస్ట్ అప్డేట్

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రావాలని మహేష్ బాబు అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా తో బిజీ గా ఉన్న మహేష్ బాబు, ఆ సినిమా షూటింగ్ అయ్యాక రాజమౌళి తో సినిమా చేస్తాడు. ప్రస్తుతం రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ తో బిజీ గా ఉన్నాడు.

ఈ సినిమా ఒక ఆఫ్రికన్ అడ్వెంచర్ సినిమా అని చాలా ఊహాగానాలు వచ్చాయి. మహేష్ తో తాను చేయబోయే చిత్రం ‘గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్’ అని రాజమౌళి వెల్లడించారు. గ్లోబ్ ట్రోటింగ్ అంటే ‘ప్రపంచాన్ని చుట్టి రావడం’.

మహేష్ తో తాను చేయబోయే చిత్రం ‘గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్’ అని రాజమౌళి వెల్లడించారు. గ్లోబ్ ట్రోటింగ్ అంటే ‘ప్రపంచాన్ని చుట్టి రావడం’. అంటే ఈ సినిమాలో  మహేష్ బాబు ఒక గ్లోబల్ ట్రావెలర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఆ నేపథ్యంలో అతను  ఎదుర్కొనే సంఘటనలు అలాగే అక్కడ ఏమవుతుంది అనే అంశం చుట్టూ సినిమా తిరుగుతుంది.

ఈ సినిమా కథ హాలీవుడ్ సినిమా జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ తన శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర ఆర్టిస్ట్స్ ని ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదు.