పూజా హెగ్డే హెల్త్ అప్పటికి రికవర్ అయిపోతుందా??

ఒక్క మన సౌత్ ఇండియా లోనే కాకుండా పాన్ ఇండియా మార్కెట్ లో కూడ ఆమంచి ఫేమ్ ఉన్న అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే మరియు సమంత కూడా ఒకరు. మరి రీసెంట్ గా హీరోయిన్ సమంతా తన హెల్త్ విషయంలో షాకింగ్ ఫాక్ట్ ని రివీల్ చెయ్యగా ఈ వార్త సినీ వర్గాల్లో షాకింగ్ గా మారింది.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అయితే పూజా హెగ్డే హెల్త్ విషయంలో కూడా ఓ షాకింగ్ న్యూస్ కొన్ని రోజులు కితం బయటకి వచ్చింది. ఆమె తన కాలికి ఓ కట్టుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్ పెద్ద ఎత్తున వైరల్ కాగా దీనితో ఈమె సినిమాలు కూడా ఆపాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈమె ఆరోగ్యానికి సంబంధించి కొత్త న్యూస్ తెలుస్తుంది. ఈమె ఈ డిసెంబర్ నాటికి పూర్తిగా రికవర్ అయ్యిపోతుంది అంట.

మరి మహేష్ తో ఈమె సినిమా చేస్తుండగా ఈ చిత్రాన్ని కొత్త షెడ్యూల్ ని అయితే మేకర్స్ ఈ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయనుండగా అప్పటికి అయితే పూజా హెగ్డే పర్ఫెక్ట్ గా రెడీ కానుంది అని సమాచారం. ఇంకా ఈ సినిమాలో మరింత మంది స్టార్స్ నటించనుండగా హారికా హాసిని క్రియేషన్స్ వారు సుమారు 200 కోట్లతో భారీ ఏక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.