గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు కొన్ని భారీ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాల్లో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ తో చేయబోయే “భవదీయుడు భగత్ సింగ్” కూడా ఒకటి. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పదేళ్ల తర్వాత రీ యూనిట్ అయ్యిన ఈ క్రేజీ కాంబినేషన్ పట్ల అనేక అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా కొన్ని ఊహించని అప్డేట్ లను దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చేయడం ఆసక్తిగా మారింది. ఈ చిత్రంలో పవన్ ఫస్ట్ టైం ఒక లెక్చరర్ గా కనిపిస్తాడని తెలిపాడు. అలాగే ఇది మంచి ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అని తెలిపాడు.
అయితే ఈ సినిమా షూటింగ్ పై అయితే దాదాపు ఈ సినిమా అంతా హైదరాబాద్ లోనే జరుగుతుంది అని కొన్ని సన్నివేశాలు మాత్రం ఊటీ లో వాతావరణ పరిస్థితులు బట్టి చిత్రీకరిస్తాం అని కానీ దాదాపు అయితే హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ అయ్యిపోతుంది అని తెలిపినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే ఈ సినిమా షూటింగ్ ని ఆగస్ట్ నెల నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని సినీ వర్గాల నుంచి లేటెస్ట్ సమాచారం. ఇంకా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం అందిస్తున్నారు.