చరణ్, శంకర్ ల భారీ సినిమాపై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం.!

Ram Charan Shankar

లేటెస్ట్ గా వచ్చిన తన భారీ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో పాన్ ఇండియా లెవెల్లో మెగా హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మంచి క్రేజ్ ను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తోనే అనుకుంటే నెక్సవు మరో టాప్ ఇండియా దర్శకుడు శంకర్ తో సినిమా ఓకే చేసే ఈ ఇద్దరు దర్శకులతో సినిమా చేసిన ఏకైక ఇండియన్ హీరోగా చరణ్ అరుదైన ఫీట్ సెట్ చేసాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమా షూట్ లో శరవేగంగా పాల్గొంటున్న చరణ్ దాదాపు 30 శాతం కంప్లీట్ చేసేసాడు. అయితే ఈ భారీ స్థాయి పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ పై తెలుస్తుంది. మరి ఈ సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలుసు.

అయితే శంకర్ ఫామ్ లో లేడు ఈ సినిమాని లిమిటెడ్ గా తెరకెక్కిస్తున్నాడు అంటే అది పొరపాటే అట. ఈ సినిమాలో పాటలని కూడా తన రేంజ్ లోనే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడట. అలాగే ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండగా వాటిలో మూడు నాలుగు పాటలు పిక్చరైజేషన్ జరిగాయని తెలుస్తుంది.

అలాగే వీటిలో ఒక బిట్ సాంగ్ కూడా ఉందట. మొత్తంగా అయితే ఈ సినిమా కూడా ఎక్కడా తగ్గకుండా అన్ని ఎలిమెంట్స్ తో ఉండబోతుంది అని అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా చాలా మంది తెలుగు నటులే చేస్తున్నారు. అలాగే దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.