Sarkaru Vaari Paata : లేటెస్ట్ ఇన్ఫో – “సర్కారు వారి పాట” నుంచి నెక్స్ట్ వచ్చే సాంగ్ ఏంటో తెలుసా?

Sarkaru Vaari Paata : ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర రాబోతున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట” కూడా ఒకటి. హిట్ దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లో వరుసగా మూడు భారీ హిట్స్ తర్వాత తెరకెక్కుతుంది. అందుకే మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం మరింత స్పెషల్ గా మారింది.
అయితే ఈ సినిమా నుంచి ఇది వరకు వచ్చిన మొట్ట మొదటి సాంగ్ ‘కళావతి’ వచ్చి సూపర్ హిట్ అయ్యి భారీ రెస్పాన్స్ తో ఇప్పటికీ దూసుకెళ్తుంది. సంగీత దర్శకుడు థమన్ ఎస్ ఎస్ ఇచ్చిన ఈ సాంగ్ తర్వాత రెండో సాంగ్ ఎలా ఉంటుందా అని ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా చూస్తుండగా ఇప్పుడు లేటెస్ట్ టాక్ దీనిపై ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తుంది.
ఈ సారి సినిమా నుంచి టైటిల్ ట్రాక్ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సాంగే హీరో ఎంట్రీ సాంగ్ అన్నట్టు కూడా వినిపిస్తుంది. ఇంకా ఈ సాంగ్ బహుశా ఈ మార్చ్ లోనే రావచ్చని సమాచారం. ఇంకో ఆసక్తికర టాక్ ఏమిటంటే ఈ సాంగ్ లో మహేష్ లుక్స్ గాని తన డాన్స్ మూమెంట్స్ గాని మరో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలుస్తాయట.
మరి ఈ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ కావడమే ఇక తరువాయి అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా రానున్న మే 11న ఈ చిత్రం విడుదల కానుంది.