ఇండస్ట్రీ టాక్ : మహేష్, త్రివిక్రమ్ సినిమాలో ఈ స్టార్ హీరో కూడానా.?

mahesh babu and trivikram project

Mahesh Babu and Tivikram Project : రీసెంట్ గా మన టాలీవుడ్ సినిమా దగ్గర భారీ హిట్ గా నిలిచినటువంటి చిత్రాల్లో దర్శకుడు పరశురామ్ పెట్ల మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలంబోలో వచ్చిన చిత్రం “సర్కారు వారి పాట” కూడా ఒకటి. గట్టి వసూళ్లను రాబడుతుండగా ఈ సినిమా రిలీజ్ తర్వాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలుసు.

అయితే సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు అంటేనే తారాగణం ఓ రేంజ్ లో ఉంటుంది. హీరోలు హీరోయిన్ లు ఇలా చాలా గ్రాండ్ గానే ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాలో మహేష్ తో తన హ్యాట్రిక్ సినిమాని కూడా చేస్తున్నాడట. ఇండస్ట్రీలో లేటెస్ట్ గా వైరల్ అవుతున్న వార్తల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మన టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో ఒక కీలక పాత్ర చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఆ హీరోకి పేరుగా ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని పేరు అండర్ లో ఉందట. ఇప్పుడు ఇదే మాట టాలీవుడ్ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలని సినీ ప్రముఖులు అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఆల్రెడీ హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ కాగా మరో స్టార్ హీరోయిన్ బాలీవుడ్ నుంచి ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.