క్రేజీ గాసిప్ : శంకర్, చరణ్ ల సినిమా టైటిల్ అప్పుడే వచ్చేస్తుందా.??

రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా అయినటువంటి ట్రిపుల్ ఆర్(RRR) చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాతే రామ్ చరణ్ కి కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ క్రేజ్ తో ఇంకో పాన్ ఇండియా సెన్సేషన్ దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ ఇంకో భారీ స్థాయి సినిమాని ప్లాన్ చేసిన సంగతి కూడా విధితమే.

అయితే ఈ సినిమాపై ఇప్పుడు అనూహ్యంగా ఒక షాకింగ్ గాసిప్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. దీనితో అయితే ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసేస్తున్నారని ఒక టాక్ పెద్ద ఎత్తున సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ అప్డేట్ కూడా రేపు మే 19న సాయంత్రమే వచ్చేస్తుంది అని అంతా అంటున్నారు.

దీనితో ఒక్కసారిగా అయితే ఈ క్రేజ్ గాసిప్ ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ఈ సినిమా టాక్ లో ఎంత నిజముందో రేపటితో తెలిసిపోతుంది. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అనేకమంది తెలుగు స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.