బంగార్రాజు మామూలోడు కాదు..’లడ్డుండా..’ !

సోగ్గాడు మరోసారి బాక్సాఫీస్ మీద కన్నేశాడు. అదే పాత్రలో ఈ సారి ‘బంగార్రాజు’గా వస్తున్నాడు. నాగార్జున డ్యూయల్ రోల్‌లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా యూత్‌తో పాటు, ప్యామిలీ ఆడియన్స్‌నీ ఎట్రాక్ట్ చేసి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ టైటిల్‌తో అదే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీనే ‘బంగార్రాజు’. లేటెస్టుగా ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు ఓ పాటను రిలీజ్ చేశారు. నాగార్జున సారధ్యంలో ‘లడ్డుండా..’ అంటూ సాగే ఈ సాంగ్‌లో బంగార్రాజుగా నాగార్జున ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు.

స్వర్గం బ్యాక్ డ్రాప్‌లో సాగే పాట ఇది. రంభ, ఊర్వశి, మేనకలతో పాటు, ఇంకా చాలా మంది అందాల భామలు ఈ సాంగ్‌లో నాగార్జునతో ఆడి పాడుతున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ పాటలోని కొన్నిసరదా సరదా లిరిక్స్ నాగార్జున కూడా హమ్ చేశారు.

ఓవరాల్‌గా కలర్ ఫుల్ కాన్సెప్ట్‌తో ఈ పాట ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తోంది. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బంగార్రాజు తనయుడిగా నాగచైతన్య కూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.