వచ్చి రాగానే వరసగా అవకాశాలు అందుకుంటోంది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి. కనీసం 20 ఏళ్ళు కూడా రాలేదు తెలుగులో వరసబెట్టి యంగ్ హీరోలకి జంటగా సినిమా అవకాశాలు అందుకుంటోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఈ సినిమాలన్ని కంప్లీటయి 2021 లో రిలీజైతే ఇక ఈ కుర్ర భామ కి తిరుగుండదు. ఇదే ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే తెలుగులో కృతి శెట్టి నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఎలా అవకాశాలు అందుకుంటోంది అని.
ఎందుకంటే మనవాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. డెబ్యూ సినిమా హిట్ అయితేనే ఆ అమ్మాయిని లక్కీ హీరోయిన్ గా భావిస్తారు. మరి కృతి శెట్టి కి ఇలా వరస అవకాశాలు ఎలా సాధ్యం అవుతున్నాయి. అంటే ఒకటే సమాధానం. మొదటి సినిమా ఉప్పెన లో ని ఒకే ఒక్క సాంగ్ … నీ కన్ను నీలి సముద్రం. విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ సాంగ్ లో కృతి శెట్టి యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అందరి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.
క్యూట్ లుక్స్ .. చలాకితనం.. చాలా చాలా ప్లస్ లు ఉన్నాయి కృతి శెట్టి లో. అందుకే యంగ్ హీరోలకి పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ కారణంగానే దర్శక, నిర్మాతలు కృతి శెట్టి డేట్స్ లాక్ చేసేసుకుంటున్నారు. ఉప్పెన రిలీజ్ కి రెడీగా ఉండగా నాని నటించబోతున్న శ్యామ్ సింగ్ రాయ్ లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ఈ బ్యూటి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్మైంట్స్ వారు నిర్మించే ఒక రీమేక్ సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా ఫైనల్ అయింది. మొత్తం కృతి శెట్టి చేతిలో 4 సినిమాలున్నాయి. ఇది ఎవరూ ఊహించనిది.