Krithi Shetty : నానితో ఆ హాట్ సీన్ పై ఆసక్తికర కామెంట్స్ తో ఓపెన్ అయ్యిన కృతి శెట్టి.!

Krithi Shetty : ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హిట్స్ తో దూసుకెళ్తున్న లక్కీ హీరోయిన్స్ జాబితాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి కూడా ఒకరు. ఉప్పెన తర్వాత రీసెంట్ గా నాచురల్ స్టార్ నాని తో చేసిన భారీ సినిమా “శ్యామ్ సింగ రాయ్” కూడా ఒకటి.

అయితే ఈ సినిమాలో తన మొదటి సినిమాతో పోలిస్తే కంప్లీట్ డిఫరెంట్ గా ప్లే చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో లంగా వోణి తో కనిపించి అలరిస్తే శ్యామ్ సింగ రాయ్ లో అయితే మొత్తం ట్రెండీ గా కనిపించి యూత్ ని మరింత అట్రాక్ట్ చేసింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో అయితే తాను నానితో చేసిన లిప్ లాక్ హాట్ సీన్ ఆ మధ్య ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ అయ్యింది. రెండో సినిమాకే ఈ హీరోయిన్ ఈ రేంజ్ లో ఏంటా అని అనుకున్నారు. మరి దీనిపై కృతి లేటెస్ట్ ఇంటర్వ్యూ లో ఓపెన్ అయ్యింది.

ఈ సీన్ చేసాక నా రోల్ ని ఆడియెన్స్ ఎలా తీసుకుంటారో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ దాని విషయంలో సినిమా చూసాక ఎవరి నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్ రాలేదు. అదొకటి మాత్రం చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పేసింది. దీనితో ఇలాంటి సీన్స్ పట్ల ఇక నుంచి తనకి ఎలాంటి అభ్యంతరం లేనట్టే అని చెప్పాలి.