కృతి శెట్టి ఎందుకు తగ్గట్లేదో ఇప్పుడు అర్థమైంది

Krithi Shetty bags another two big projects

Krithi Shetty bags another two big projects

కృతి శెట్టి.. ప్రస్తుతం యువ హీరోలతో సినిమాలు చేసే దర్శకులకు మంచి ఆప్షన్ అవుతోంది. మొదటి సినిమా ‘ఉప్పెన’తో ఆమె బోలెడంత ఫేమ్ సంపాదించుకుంది. యువతలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే ఆమె చేతిలో మూడు ఆఫర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి రామ్, లింగుస్వామి ప్రాజెక్ట్ కాగా రెండవది నాని ‘శ్యామ్ సింగ రాయ్’. మూడవది సుధీర్ బాబు – ఇంద్రగంటి చిత్రం. ఇవి కాకుండా ఇంకో రెండు కొత్త సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

అవి కూడ చిన్న సినిమాలేమీ కాదు పెద్దవే. వాటిలో నితిన్ చిత్రం ఒకటి కాగా రెండవది నాగ చైతన్య సినిమా. నితిన్ కొత్త దర్శకుడు శేఖర్ డైరెక్షన్లో ఒక సినిమాకు సైన్ చేయడం జరిగింది. ఇందులో కృతి శెట్టిని కథానాయికగా ఎంపిక చేశారు. ఇక కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగ చైతన్యలు కలిసి చేయనున్న ‘బంగార్రాజు’లో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి ఫైనల్ అయింది.

మొత్తానికి ఈ కొత్త అమ్మాయి చేతిలో ఐదు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇంత డిమాండ్ ఉంది కాబట్టే కృతి శెట్టి రెమ్యునరేషన్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గట్లేదు. ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తోంది. ఇంత వేగంగా కోటి రూపాయల మార్క్ తాకిన హీరోయిన్ కృతి శెట్టినే.