Pawan Director Twitter War : ఆ చిచ్చు..”క్రాక్” నటుడు, పవన్ దర్శకుడు ట్విట్టర్ లో ఓ రేంజ్ వార్.!

Pawan Director Twitter War : ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ పొలిటికల్ సమస్యలు ఏమో కానీ వాటి వల్ల మన టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు అయితే గొడవలు పెట్టేసుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా నిన్న రాత్రి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెద్ద రచ్చే నడిచింది అని చెప్పాలి.

అయితే వీరిద్దరూ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్ అలాగే మరొకతను టాలీవుడ్ లో అందరికీ బాగా తెలిసిన వ్యక్తే బి వి ఎస్ రవి. తాను రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజ “క్రాక్” లో కూడా కనిపించాడు. మరి రవి నిన్న రాత్రి ఏపీలో జరిగిన భారీ ధర్నాపై స్పందిస్తూ..

ఎవరినీ మెన్షన్ చెయ్యకుండా “అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయo చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది.” అని ట్వీట్ పెట్టగా దానికి హరీష్ శంకర్ ఆ అధికారాన్ని అనుభవించడానికా అంటూ రిప్లై ఇవ్వడంతో స్టార్ట్ అయ్యింది రచ్చ.

దీనితో ఇద్దరి వాగ్వాదాలు తమ సినిమాలు వాట్సాప్ పర్శనల్స్ అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అలాగే ఫైనల్ గా పవన్ తో హరీష్ శంకర్ చేస్తున్న “భవదీయుడు భగత్ సింగ్” సినిమాకి ఆల్ ది బెస్ట్ అని బి వి ఎస్ రవి చెప్పడం కుదిరితే నన్ను సెట్స్ లోపలికి రానిస్తే కలుద్దాం అని చెప్పడం.

దానికి బదులుగా హరీష్ శంకర్ సెట్స్ లోకి ఎందుకు ఏకంగా సినిమాలోకే రావచ్చు అసలే ఈ మధ్య నువ్వు “వేశాలు” కూడా వేస్తున్నావుగా అని ఒక రేంజ్ లో వీరిద్దరి గొడవ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. దీనితో సోషల్ మీడియాలో వీరి వార్ పెద్ద ఎత్తున అభిమానుల్లో ట్రెండ్ అవుతుంది. మరి వీరి వాగ్వాదం ఇక్కడితో ఆగిపోయిందో ఇంకా పర్సనల్ గా తీసుకున్నారో వారికే తెలియాలి.