Upasana: మెగా కోడలు, హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. మెగా కోడలిగా ఇంటి బాధ్యతలు చేయబడుతూనే, మరొకవైపు అపోలో హాస్పిటల్ కు సంబంధించిన బాధ్యతలను నిర్వహిస్తూనే, తనకు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ముచ్చటించడమే కాకుండా తన అభిమానుల కోసం, ఆరోగ్య సలహాలు, పద్ధతులు, జంతు సంరక్షణ గురించి సలహాలు ఇస్తూ ఉంటుంది. ఎక్కువగా అంతరించిపోతున్న జీవరాశులు, అడవుల్లో ఉండే మానవాళి కోసం ఆలోచిస్తూ ఉంటుంది.
ఉపాసన ఎక్కువగా సామాజిక సేవ చేస్తూ ఉంటుంది. సామాజిక సేవ ఉపాసనకు అంత పాపులారిటీ తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. కొందరు హిందువులు ఆమెపై విరుచుకుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. తమ మనోభావాలు ఉపాసన దెబ్బతీసింది అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఉపాసన ఒక పెద్ద గుడి గోపురం పై దేవుడి విగ్రహాల మధ్యలో కొందరు సామాన్య ప్రజల నిలుచున్నట్లుగా ఫోటో ఎడిట్ చేసింది.
గుడి గోపురం పై సూక్ష్మరూపంలో కొందరు ప్రజలు నిల్చుని ఉన్న ఫోటోలో తన ఫోటో తన భర్త రామ్ చరణ్ ఫోటో ని పెట్టి ఎక్కడ ఉన్నామో కనుక్కోండి.. అంటూ ఉపాసన తన ఫాలోవర్లను కోరింది. మొదట ఈ ఫోటోపై పాజిటివ్ గానే స్పందించినప్పటికీ రానురాను ఆ ఫోటో పై నెగిటివ్ ట్రోల్స్ మొదలయ్యాయి. గుడి గోపురం దాని మీద మనుషుల నిల్చోవడం ఏంటి? చెప్పులు, బూట్లు వేసుకుని అలా నిల్చునట్టు గా బొమ్మలు గీయడం ఏంటి? అంటూ ఉపాసన పై మండి పడుతున్నారు. కొందరు అయితే వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేయండి అని డిమాండ్ చేశారు. ఇదే ఈ విషయంపై ఉపాసన ఏమాత్రం తగ్గకుండా, తాజాగా మరొక పోస్ట్ ని చేసింది. ఆ పోస్ట్ లో స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది మనలోనే పుడుతుంది.. స్వేచ్ఛగా..భయం లేకుండా ఉండాలి ఎప్పుడు వికసిస్తూ ఉండాలి అంటూ నవ్వుతున్న ఫోటోని షేర్ చేసింది.