Maharaja 2: తమిళ నటుడు హీరో విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికి తెలిసిందే. ఈయనకు తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. మరి ముఖ్యంగా తెలుగు వాళ్లలో అతణ్ని అభిమానించే వారి సంఖ్య పెద్దదే. ఇతర భాషా చిత్రాలను కూడా బాగా చూసే తెలుగు వారికి సేతుపతి సైరా, ఉప్పెన చిత్రాల్లో నటించడానికి ముందే సుపరిచితమే. కానీ ఈ రెండు సినిమాలలో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. తమిళంలో అతను నటించే సినిమాలు వరుసగా తెలుగులోకి అనువాదం అవుతున్నాయి.
అయితే మిగతా చిత్రాలేవీ ఆశించన స్థాయిలో వర్కవుట్ కాలేకపోయాయి. కానీ గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయినా మహారాజ మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. థియేటర్లలో మంచి ఫలితాలను అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యాక అదిరిపోయే రెస్పాన్స్ ని తెచ్చుకుంది. కొన్ని నెలల పాటు ఓటీటీలో మహారాజ తెలుగు వెర్షన్ బాగా ట్రెండ్ అయింది. ఈ రోజుల్లో ప్రతి హిట్ సినిమాకు ప్రేక్షకులు సీక్వెల్ ఆశిస్తున్నారు. మహారాజా ఫ్యాన్స్ కి కూడా ఆశ ఉంది. దాన్ని విజయ్ సేతుపతి, దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ నెరవేర్చబోతున్నారన్నది ఇప్పుడు కోలీవుడ్ లో టాక్.
మహారాజ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయిన నిథిలన్ కు స్టార్ల నుంచి చాలానే ఆఫర్లు వచ్చినా విజయ్ మాత్రం కొత్త సినిమాను ప్రకటించలేదు. నిథిలన్ మళ్లీ సేతుపతితోనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అది కూడా మహారాజ సీక్వెలేనట. అయితే ప్రస్తుతం ఈ స్క్రిప్టు పనులు చివరి దశలో ఉన్నాయట. నిథినల్ ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇవ్వడానికి సేతుపతి రెడీగా ఉన్నాడట. త్వరలోనే సీక్వెల్ ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. మహారాజ సౌత్ ఇండియాలోనే కాదు చైనాలో కూడా అదిరిపోయే వసూళ్లు సాధించడం విశేషం. ఈసారి చాలా పెద్ద స్థాయిలో సినిమా రిలీజ్ అవుతుందనడంలో సందేహం లేదు. అయితే మరి ఈ విషయంపై విజయ్ సేతుపతి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.