మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. హత్య కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితుల్ని పోలీసులు విచారించడంతో రవీంద్ర ప్లానింగ్ ప్రకారమే హతమార్చినట్లు వాంగ్ములం ఇచ్చారు. దీంతో పోలీసులు రవీందర్ పై కేసు నమెదు చేసి అరెస్ట్ కు రంగం సిద్దం చేసారు. ఈ నేపథ్యంలో పోలీసుల బృందం కొల్లు రవీందర్ ఇంటికి, కార్యాలయానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. రవీందర్ కు ఫోన్ చేసారు. ఆ సమయంలో ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో పోలీసులు రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేసారు. గాలింపు చర్యలు వేగవంతం చేసారు.
చివరికి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం హైవే వద్ద శుక్రవారం రాత్రి రవీంద్ర మప్టీలో ఉన్న పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదైన వెంటనే రవీంద్ర పరారీ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా నుంచి విశాఖపట్నానికి కారులో బయలదేరినట్లు చెబుతున్నారు. యూనిఫాంలో ఉన్న పోలీసులు కళ్లు గప్పి కారులో ప్రయాణించడంతో అనుమానం వచ్చిన పోలీస్ బృందాలు మప్టీలో కూడా పోలీసుల్ని ఏర్పాటు చేసి రంగంలోకి దించారు. చివరికి తునిలో రవీంద్ర పట్టుబడటంతో అక్కడ నుంచి నేరుగా విజయవాడకు తరలించారు. మోకా భాస్కరరావు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో రవీంద్ర పేరు కూడా ఉందని వెలుగులోకి వచ్చింది.
నిందుతులు ఇచ్చిన వాంగ్ములం, భాస్కరరావు ఫ్యామిలీ ఫిర్యాదు మేరకు రవీంద్ర పై బలమైన కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పట్టుబడిన నేపథ్యంలో ఆయన నుంచి హత్యకు సంబంధించి కీలక సమాచారం, హత్యకు గల కారణాలను రాబట్టే అవకాశం ఉంది. అయితే రవీంద్ర అరెస్ట్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసారు. రవీంద్రను ప్రాథమికంగా విచారించకుండా అరెస్ట్ చేయడాన్ని కక్షసాధింపుగా చెప్పుకొచ్చారు. బీసీలను అణగదొక్కేందుకే ఇలా ఆ సామాజికి వర్గ నేతలందర్నీ తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ లు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రవీంద్ర కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు.