బొటిక్ వ్యవహారంలో కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్.. శ్రీవిద్య, లక్ష్మీ అనే ఇద్దరు మహిళలతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. తాగి వచ్చి తమపై లైంగిక దాడి చేశాడని ఇద్దరు మహిళలు రాయదుర్గం పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో కొద్ది సేపటి క్రితం అమర్‌ని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. కోర్ట్ రిమాండ్ విధించమని ఆదేశించడంతో పోలీసులు అరెస్ట్ చేసి ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ గొడవ విషయానికి వస్తే శ్రీ విద్య, లక్ష్మీ , స్వాతి ముగ్గురు మహిళలు మణికొండలో బొటిక్ వ్యాపారం చేస్తున్నారు. ఇందులో లాస్ రావడంతో స్వాతి వ్యాపారం నుండి తప్పుకుంది. అయితే తనకు రావలసిన డబ్బులు ఆ ఇద్దరు మహిళలు ఇవ్వకపోవడంతో స్వాతి తన బాయ్ ఫ్రెండ్ అమర్‌తో పాటు పలువురు వ్యక్తులని తీసుకొని వాళ్ళింటికి వెళ్ళింది.కొద్ది సేపు చర్చల తర్వాత మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసాయి. సమీర్ తాగిన మత్తులో అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీవిద్య రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అమర్ తాను తాగలేదని, ఇవ్వాల్సిన డబ్బులు గురించే అడిగానని చెప్పాడు. వీడియోలో కొద్దిగానే చూపించి నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. ఈ గొడవకు తనకు సంబంధం లేదని.. ఓ టీవీ జర్నలిస్ట్ కుట్ర పన్ని ఇలా చేసిందని.. ఆమె తనను చెంపపై కొట్టడమే కాకుండా రౌడీ షీటర్లతో తమపై దాడి చేయించిందంటూ సంచలన విషయాలను చెప్పాడు అమర్. అయితే ఇప్పుడు అమర్ అరెస్ట్ కావడంతో కోయిలమ్మ సీరియల్ టీంలో ఆందోళన నెలకొంది.