వైకాపా నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయ హత్య అని మంత్రి నాని ఆరోపించిన 24 గంటల్లోనే అది నిజమని ఆ జిల్లా పోలీస్ అధికారులు నిరూపించారు. పాత క్షక్షలు..రాజకీయ కుట్రలో భాగంగా మోకాని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో దీని వెనుక ఇంకెంత మంది ఉన్నారు? పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయా? అని పోలీసులు కూపీ లాగుతున్నారు. వైకాపా సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత..ఏడాది పూర్తయిన తర్వాత జరిగిన తొలి హత్య ఇది. పైగా ఈ హత్యలో ప్రతిపక్ష పార్టీ నేత హస్తముందని తేలడంతో రాజకీయ వాతావరణ మరింత వేడెక్కడం ఖాయంగా కానిపిస్తోంది.
ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసారు. మోకా హత్య వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మరో సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఉన్నారని ఆరోపించారు. హత్యలో వీళ్లిద్దరి హస్తం కూడా ఉండి ఉంటుందని అనుమానించారు. వీళ్లని కూడా ఆరెస్ట్ చేసి విచారిస్తే మరింత సమాచారం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. స్థానికంగా భాస్కరరావు ఎదుగుదలను ఓర్వలేక టీడీపీ నేత రవీంద్ర, నాంచారయ్య తట్టుకోలేక ఇలా చేయించారని, లోతుగా విచారణ చేపడితో ఇంకా ఇద్దరు దొరుకుతారంటూ మండిపడ్డారు. మంత్రి స్థానంలో ఉన్న కొడాలి ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయాలలో చర్శనీయాంశగా మారాయి.
అధికారంలో ఉన్న మంత్రి ఇలా ప్రతిపక్ష నేతలపై హత్య కేసు మోపడంతో సంచలనంగా మారింది. పైగా నాని కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజక వర్గం నుంచి గెలిచి మంత్రి అయ్యారు. స్థానిక రాజకీయాల గురించి బాగా తెలుసు. నాని టీడీపీ నాయకులలో కలిసి పనిచేసిన పూర్వానుభవం ఉంది. ఆ పార్టీ నేతల గురించి బాగా తెలిసిన నాయకుడు. ఈ నేపథ్యంతో నాని తాజా వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీ సహా అధికార పక్షం నేతల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. మరి పోలీసులు ఆ రకంగా చర్యలకు సిద్దమవుతు న్నారా? అన్నది చూడాలి.