టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరెత్తితో ఒంటికాలుపై లేచిపడే మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు అండ్ సన్ లోకేష్ పై ధ్వజమెత్తారు. ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గుడివాను ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో ఎప్పుడైనా పేదల కోసం ఎకరం భూమి కొన్నట్లుగా చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి సవాల్ విసిరారు. గుడివాడ రూరల్ ఏరియాల్లో పర్యటనల్లో భాగంగా కోడాలి పై విధంగా స్పందించారు. చంద్రబాబు మృగంలా ప్రవర్తిస్తున్నాడన్నారు. ఆయన సామాజిక వర్గం బాగు కోసం చూస్తారు తప్ప..పక్కవాడు ప్రాణాల మీదకొచ్చి కొట్టుకుంటున్నా పట్టించుకోరన్నారు. కులం మాత్రమే ఆయన కూడు పెడుతుందన్నట్లు బ్రతుకుతున్నాడన్నారు.
ఇన్నాళ్లు కులం మీద చూపించిన ప్రేమలో 10 శాతం రాష్ర్ట ప్రజల మీద చూపించి ఉంటే రాష్ర్టం ఎప్పుడో బాగుపడేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి 45 ఏళ్ల వయసులోనే రాజకీయ పార్టీ పెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకుడయ్యారన్నారు. అటుపై ప్రజల మద్దతుతో 151 సీట్లు గెలిచారు. రాజకీయం అంటే అది. అంతేగానీ ఎన్టీఆర్ పేరు చెప్పుకుని నీలా సిగ్గుమాలిన రాజకీయాలు తమ పార్టీలో ఎవరికి చేతకావన్నారు. ప్రజల సమస్యలను 20 రోజుల్లోనే పరిష్కరించాలని గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామ న్నారు. ఇప్పటికై నా చంద్రబాబు రాజకీయ పాలన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎద్దేవా చేసారు. పనికి రాని చవట, దద్దమ్మ, పప్పు కోసం రాష్ర్ట ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దన్నారు.
లోకేష్ కింద జాకీలు పెట్టి ఎంత లేపినా ఆయన లేవడని ఎద్దేవా చేసారు. ములం చెట్టు ఆకుకి…కరివేపాకు ఆకుకి తేడా తెలియపి లోకేష్ ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచయేడం తెలుగు దేశం చేసుకున్న దురదృష్టం అన్నారు. 2007లో తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హైదరాబాద్ వరకూ పాద యాత్ర చేస్తే చాలా మంది రాజకీయ నాయకులు సాధ్యపడదన్నారు. 2008 లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 77 ఎకరాల భూమిని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఇచ్చరన్నారు. ఆ స్థలంలో గత ప్రభుత్వం టీడీపీ టిడ్కో పేరుతో ప్రజల్ని మోసం చేసిందన్నారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేదలకు 30 లక్షలకు పైగా ఇల్ల పట్టాలు పంపీణి చేస్తుంటే చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిప్డడ్డారు.