King Nag Condemns : నాగ్ ఖండించాడు సరే, సమంత స్పందించలేదెందుకు.?

King Nag Condemns :  ‘సమంత ముందుగా విడాకులు కోరింది. ఆమె కోరిక మేరకు నాగచైతన్య విడాకులకు ఒప్పుకున్నాడు..’ అని అక్కినేని నాగార్జున ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడంటూ తెలుగు మీడియా కొద్ది రోజుల క్రితం కథనాల్ని వండి వడ్డించింది. ఆ కథనాల్ని పట్టుకుని అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సమంతని అత్యంత దారుణంగా ట్రోల్ చేశారు.

ఈ వ్యవహారంపై నాగ్ స్పందించాడు.. జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాడు. సమంత – నాగచైతన్య విడాకుల విషయమై తానెలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని అక్కినేని నాగార్జున స్పష్టం చేశాడు. దాంతో, ‘సమంత తొలుత విడాకులు అడిగింది’ అన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు అక్కినేని నాగచైతన్య, సమంత ‘విడాకుల ప్రకటన’ ఉమ్మడిగా చేసిన విషయం విదితమే. అది కూడా సోషల్ మీడియా వేదికగానే జరిగింది. ఆ తర్వాత జరిగిన ట్రోలింగ్ కారణంగా సమంత చాలా ఆవేదన వ్యక్తం చేసింది.

ఓ దశలో ఈ వేధింపులు తాళలేక, కోర్టును కూడా ఆశ్రయించింది. ఆ తర్వాత మళ్ళీ నాగ్ వ్యాఖ్యలంటూ చెలరేగిన దుమారంతో.. సమంత మరింతగా హర్ట్ అయి వుంటుందేమో. అయితే, నాగార్జున వివరణ తర్వాత ఎక్కడా సమంత ఈ విషయం గురించి మాట్లాడలేదు.

అప్పటిదాకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటూ, రకరకాల కొటేషన్లను షేర్ చేస్తూ వచ్చిన సమంత, ఆ తర్వాత కొటేషన్ల జోలికి పెద్దగా పోలేదు. కారణమేంటట.? ‘రీ-యూనియన్’ అంటూ గాసిప్స్ వచ్చినా సమంత సైలెంట్ అయ్యిందెందుకు.?