కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కథానాయకుడిగా శివ కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది. సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు కూడా భారీగా విడుదల చేస్తున్నారు నిర్మాతలు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఆడియోని లాంచ్ చేశారు.
ఆడియో లాంచ్ ఈవెంట్ లో శ్రేయాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాని విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కి కృతజ్ఞతలు. నైజం, వైజాగ్- దిల్ రాజు గారు, సీడెడ్ -ఎన్వీ ప్రసాద్ గారు, ఈస్ట్ వెస్ట్, కృష్ణ- గీత ఆర్ట్స్, గుంటూరు- యువీ క్రియేషన్స్, నెల్లూరు -హరి పిక్చర్స్ విడుదల చేయడం ఆనందంగా వుంది. గత ఏడాది అక్టోబర్ కన్నడలో విడుదలైన సినిమా పెద్ద విజయం సాధించింది. అదే సమయంలో ఇక్కడ విడుదల చేయాలనీ భావిస్తే మన దగ్గర వరుసగా పెద్ద సినిమాలు వున్నాయి. అందుకే ఇక్కడ విడుదల చేయలేకపోయాం. పాండమిక్ తో కూడా కొంత ఆలస్యమైయింది. మంచి సినిమా మంచి డేట్ చూసుకొని వద్దామని ఎదురుచూశాం. సెప్టెంబర్ 16న విడుదల చేస్తున్నాం. సుదీప్ విక్రాంత్ రోణ సినిమా పాన్ ఇండియా క్రేజ్ సంపాయించుకుంది. ‘కే3 కోటికొక్కడు’ కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. ఈ చిత్రంలో అన్నీ వర్గాల ప్రేక్షకులని అలరించే కంటెంట్ వుంది. డెబ్బై శాతం సినిమాని ఫారిన్ లో చిత్రీకరించారు. సినిమా గ్రాండ్ గా వుంటుంది. ఈ సినిమాలో నాలుగు పాటలు అద్భుతంగా వచ్చాయి. అందరూ తెలుగు గాయకులతో పాడించాం. సింహ, గీతా మాధురి, లిప్సిక, సత్యమణి, సాయి చరణ్ పాడారు. సెప్టెంబర్ 13 న జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ కి సుదీప్ గారు వస్తున్నారు. ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రానికి ప్రేక్షకులు సపోర్ట్ చేయాలి” అని కోరారు.
సాయి కృష్ణ మాట్లాడుతూ.. కన్నడలో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సుదీప్ గారి సినిమాలన్నీ ఇక్కడ చూస్తాం. ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమాని చాలా గ్రాండ్ గా తీశారు. తెలుగు లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది” అన్నారు
గాయకుడు సింహా మాట్లాడుతూ.. ‘కే3 కోటికొక్కడు’ కన్నడ లో బ్లాక్ బస్టర్. ఈ సినిమాని తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు శ్రేయాస్ శ్రీనివాస్ గారు. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో ప్రత్యేకంగా పాటలు పాడించారు. ఇందులో పటాకీ పోరి అనే పాటని పాడను అద్భుతంగా వచ్చింది. సెప్టెంబర్ 13 జరిగే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాటలని లైవ్ లో పాడుతాం. సెప్టెంబర్ 16 న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు