శ్రీదేవి రెండో కూతురు హడలెత్తిస్తోంది

Khushi Kapoor readying for her debut

Khushi Kapoor readying for her debut

అలనాటి అందాల తార శ్రీదేవి ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆమె మరణం ఇప్పటికీ అభిమానుల్ని కలచివేస్తూనే ఉంది. ఆమె కన్నుమూశాక ఆమె వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రతికుండగా జాన్వీని హీరోయిన్ ను చేయాలని శ్రీదేవి ఎన్ని ప్రయత్నాలు చేశారో అందరికీ తెలుసు. కానీ ఆమె తెరంగేట్రాన్ని చూడకుండానే కన్నుమూశారు. తల్లి కీర్తిని భుజాన వేసుకుని పరిచయమైన జాన్వీ కపూర్ సినిమా సినిమాకు పరిణితి చెబుతూ పేరు తెచ్చుకుంటోంది. ఆమెకు బాలీవుడ్లో శ్రీదేవి కూతురిగానే కాదు సొంతగా కూడ ఇమేజ్ ఉంది. ఆమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

ఇదిలా ఉండగా తండ్రి బోనీ కపూర్ రెండవ కుమార్తె ఖుషీ కపూర్ ను కూడ హీరోయిన్ ను చేసే పనిలో ఉన్నారు. ప్రజెంట్ ఖుషీ కపూర్ లాస్ ఏంజిల్స్ నందు నటనలో శిక్షణ తీసుకుంటోంది. ఈమధ్య సోషల్ మీడియాలో ఫోటోలు కూడ పెడుతోంది. వాటిని చూస్తే ఎంట్రీ సమయానికి జాన్వీ కపూర్ ఎలాగైతే ఉందో దానికంటే మెరుగ్గానే ఉంది ఖుషీ కపూర్. నెటిజన్లు సైతం ఖుషీ కపూర్ ఇప్పటికిప్పుడు హీరోయిన్ అయిపోవచ్చని, అక్క జాన్వీ కంటే ఖుషియే దూసుకెళ్లిపోతుందని, ఆమె స్టార్ హీరోయిన్ కావడం ఖాయం అంటున్నారు. లాస్ ఏంజిల్స్ వీధుల్లో నిలబడి ఖుషీ అప్లోడ్ చేస్తున్న ఫోటోలు చూస్తే ఎవరైనా అదే అనుకుంటారు.