Khiladi : హీరోకీ, దర్శకుడికీ మధ్య అభిప్రాయ బేధాలు.. ఒకరి మీద ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్న వైనం.. ఇదంతా ‘ఖిలాడీ’ సినిమా చచ్చిపోవడానికి కారణమా.? తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. రవితేజ, ‘ఖిలాడీ’ సినిమా ప్రమోషన్లలో దర్శకుడు రమేష్ వర్మ మీద సెటైర్లు వేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
నిజానికి, రవితేజ అంటే ప్రొఫెషనల్ నటుడు. వివాదాల జోలికి పెద్దగా వెళ్ళడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ‘ఖిలాడీ’ విషయంలో ఎక్కడో తేడా కొట్టేసింది. ఆ మాటకొస్తే గత కొంతకాలంగా రవితేజ చుట్టూ ఇలాంటి రూమర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి.
దర్శకుల క్రియేటివిటీతో హీరో రవితేజ ఆడుకుంటున్నాడనే విమర్శలు ఎవరో పనిగట్టుకుని పుట్టిస్తున్నారా.? లేదంటే, నిజంగా జరుగుతోన్నదీ అదేనా.? ఏమోగానీ, ‘ఖిలాడీ’ సినిమా ఇంకాస్త బాగానే ఆడి వుండేది దర్శకుడు, హీరో కలిసి సినిమాని ప్రమోట్ చేయాల్సిన రీతిలో చేసి వుంటే.
రవితేజ, డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ‘ఖిలాడీ’ ఇటీవలే విడుదలై, మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినాగానీ, ‘క్రాక్’ సినిమాని మించిన విజయాన్ని దక్కించుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది.
అయితే, ఈ వివాదంపై ఇటు రవితేజగానీ, అటు దర్శకుడు రమేష్ వర్మగానీ పెదవి విప్పకపోవడం గమనార్హం.