Meenakshi Chaudhary’s Lip Lock : ఖిలాడీనే.! మీనాక్షి చౌదరి ముద్దు ముచ్చట.!

Meenakshi Chaudhary’s Lip Lock : అయినా, ఈ రోజుల్లో లిప్ లాక్ సీన్ అంటే అందులో అంత వింతేముంది.? చిన్న సినిమానా.. పెద్ద సినిమానా.. అన్న తేడాల్లేవ్. లిప్ లాక్ సీన్స్ లేకుండా సినిమాని ఈ రోజుల్లో ఊహించుకోలేం. అందాల భామలూ ఈ విషయంలో ముందే ఖచ్చితమైన అభిప్రాయంతో వుంటున్నారు, వుండక తప్పడంలేదు కూడా.

‘ఖిలాడి’ బ్యూటీ మీనాక్షి చౌదరి కూడా లిప్ లాక్ సీన్ లాగించేసింది హీరో రవితేజతో. ట్రైలర్‌లో చూపించిన ఆ లిప్ లాక్ సీన్ వైరల్‌గా మారింది. రవితేజ వయసేంటి.? మీనాక్షి చౌదరి వయసేంటి.? దాదాపు ముప్ఫయ్యేళ్ళ వయసు తేడా వుంది ఇద్దరి మధ్యా.. ఈ లిప్ లాక్ అవసరమా.? అన్న విమర్శ సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.

ఇక, ఈ లిప్ లాక్ సీన్ విషయమై మీనాక్షి మాట్లాడుతూ, ‘ఆ సీన్ గురించి దర్శకుడు నాయకు ముందే చెప్పారు. కథలో భాగంగానే అది జరుగుతుంది. అందుకే, నేనేమీ అభ్యంతరం వ్యక్తం చేయలేదు లిప్ లాక్ విషయమై..’ అంటూ వివరణ ఇచ్చింది ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ‘ఖిలాడీ’ సినిమాలో హీరోయిన్లు డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి.. ఇద్దరూ గ్లామర్ హద్దుల్ని చెరిపేశారు. ఒకరితో ఒకరు పోటీ పడి తెరపై గ్లామర్ పండించేశారు. అంతేనా, డాన్సుల్లోనూ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారండోయ్.