Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రజనీకాంత్. ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. ఇకపోతే రజనీకాంత్ చివరగా వేట్టయాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో రజనీకాంత్ సరసన మంజు వారియర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
ఈ మూవీ తర్వాత ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ దర్శకత్వంలో కూలీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున,శృతిహాసన్,ఉపేంద్ర ఇంకా కొంతమంది సెలబ్రిటీలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చి 2025 నాటికి పూర్తవుతుందని టాక్. సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమాలో నటించిన ఉన్నారు రజినీకాంత్. గతంలో విడుదలైన జైలర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడిగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అలాగే హీరోయిన్ తమన్నా కూడా ఇందులో నటించనుందట. కేజిఎఫ్ మూవీ తో భారీగా గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి. ఈ సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరగడంతో అదే అదనుగా భావించిన ఆమె భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు దూరమయ్యాయి. అయితే అంతకుముందు విక్రమ్ చియాన్ సరసన కోబ్రా మూవీతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది శ్రీనిధి శెట్టి. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే కూలీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత జైలర్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 దీపావళికి విడుదల కానుంది.
