Pawan And Harish Shankar : ఏంటి పవన్ సినిమాలో “కేజీఎఫ్ 2” పవర్ఫుల్ నటి..??

Pawan And Harish Shankar : తాజాగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి భారీ హిట్ గా నిలిచిన మరో చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2” గురించి అందరికీ తెలిసిందే. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. అయితే గత మొదటి సినిమాలో కీలకంగా చూపించిన పాత్రలని ఈ సినిమాలో పూర్తి స్థాయిలో ఎంత పవర్ ఫుల్ గా చూపించాడో తెలిసిందే.
మరి ఆ పాత్రల్లో పవర్ఫుల్ లేడీ రోల్ రమీకా సేన్ కూడా ఒకటి. ఇండియన్ సినిమా దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీమేల్ రోల్ గా ఆమె పాత్ర కనిపించింది. అయితే ఈ పాత్రని బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ సాలిడ్ పెర్ఫార్మన్స్ తో పూర్తి చేశారు.  మరి ఈమె మన టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో కీలక పాత్ర చేయనుందని సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తోంది.
ఆ సినిమా పవన్ హిట్ దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ తో చేస్తున్న భారీ సినిమా “భవదీయుడు భగత్ సింగ్” అట. ఈ సినిమాలో ఈమె ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తుందని ఊహాగానాలు గట్టిగా ఇప్పుడు వినిపిస్తున్నాయి.
మరి దీనిపై అయితే పవన్ అభిమానులు క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మొత్తానికి అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కిస్తున్నట్టే అని చెప్పాలి. మరి ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.