కేతిక శర్మ వర్సెస్ రీతూ వర్మ.. విన్నర్ ఎవరు.?

నిన్న.. అంటే, అక్టోబర్ 29న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రెండు సినిమాలకు సంబంధించి హీరోల కంటే, హీరోయిన్ల చుట్టూ ఎక్కువ ప్రచారం జరిగింది. ఒకరేమో, పూర్తిగా హాట్ అండ్ స్పైసీ అయితే, ఇంకొకరేమో.. పద్ధతైన చీరకట్టుకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు.

వాళ్ళిద్దరూ ఎవరో కాదు, కేతిక శర్మ.. రీతూ వర్మ. కేతిక, ‘రొమాంటిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తే, రీతూ వర్మ ‘వరుడు కావలెను’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించింది. నటన పరంగా చూస్తే, రీతూ వర్మకి దాదాపు ఫుల్ మార్క్స్ పడిపోయాయ్. కానీ, గ్లామర్ పరంగా మాత్రం, కేతిక శర్మకే ఎక్కువ మార్కులు.

రీతూ వర్మ మరీ బక్క పలచగా వుందన్న కామెంట్లు రివ్యూల్లో కనిపించాయి.. ప్రేక్షకులదీ అదే ఫీలింగ్. కేతిక శర్మ మాత్రం బొద్దుగా, అందంగా కనిపించి కుర్రకారుకి గట్టిగానే గాలమేసి థియేటర్లకు లాగేస్తోంది.

కాస్త నటన మీద కూడా ఫోకస్ పెడితే, కేతిక శర్మకి స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్సులున్నాయి. రీతూ వర్మ సైతం, కాస్త బొద్దుగా మారి, కొంచెం గ్లామర్ టచ్ ఇస్తే.. కెవ్వు కేక అంతే.