చెల్లెలి పాత్రలో నటించడానికి అసలు కారణం అదే: కీర్తి సురేష్

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సరసన నేను శైలజ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కీర్తి సురేష్. ఈ సినిమాతో తన నటనతో అందరిని మెప్పించిన ఈమె ఆ తరువాత మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించారు. మహానటి సినిమాలో కీర్తి సురేష్ తన హావభావాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెకు ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది.ఇక ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ పలు విభిన్న పాత్రల్లో నటించినప్పటికీ పెద్దగా ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదని చెప్పాలి.

ఈ క్రమంలోనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించిన కీర్తిసురేష్ ప్రేక్షకులను మెప్పించలేక పోయారు.అలాగే ఈ మధ్య ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో ఏకంగా చెల్లెలి పాత్రలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబుతో కలిసి ఈమె నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కీర్తి సురేష్ పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.ఈ ఇంటర్వ్యూలలో భాగంగా చెల్లెలి పాత్రలో నటించడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు కీర్తి సురేష్ ఆశక్తికరమైన సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నట్టు భవిష్యత్ ఉంటుందనే నమ్మకం మనకు లేదు. భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు వస్తాయో రావో కూడా తెలియదు అలాంటప్పుడు అంత మంచి పాత్రలు వచ్చినప్పుడు నటించడమే మంచిదని తాను చెల్లెలి పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. చెల్లెలి పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటేనే తాను నటిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి హీరో సరసన నటించే అవకాశం రావడం చాలా అదృష్టం అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి సరసన నటించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అందుకే వారి పక్కన చెల్లెలి పాత్రలో నటించే అవకాశం రావడంతో వెంటనే నటించడానికి ఒప్పుకున్నానని వెల్లడించారు.