ప్రేమలో మునిగి తేలుతున్న కీర్తి సురేష్‌.. వ‌రుడు ఎవ‌రో తెలుసా?

ఈ కాలం నాటి అందాల భామ‌లు ఒక వైపు కెరీర్‌పై దృష్టి సారిస్తూనే మ‌రోవైపు న‌చ్చిన‌వాడితో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్నారు. ఇక టైం వ‌చ్చిన‌ప్పుడు అత‌నితో ఏడ‌డుగులు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా మ‌హాన‌టి ఫేం కీర్తి సురేష్ ప్రేమ‌లో ఉన్న‌ట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. మ‌హాన‌టి చిత్రంతో జాతీయ స్థాయి క్రేజ్ తెచ్చుకున్న కీర్తి ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకుంది. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది.


మ‌హాన‌టి సినిమా త‌ర్వాత లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన కీర్తి సురేష్ ఈ సినిమాల‌తో పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది. ప్రస్తుతం నితిన్‌కు జోడిగా ‘రంగ్‌దే’లో నటిస్తోంది. అలానే నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తోన్న గుడ్ లక్ సఖిలో కూడా నటిస్తోంది. ఇక తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రం సర్కారు వారి పాటలో నటిస్తోంది. తొలిసారి మ‌హేష్ స‌ర‌స‌న న‌టిస్తున్న కీర్తి సురేష్ ఈ సినిమాతో త‌న రేంజ్‌ను మ‌రింత పెంచుకుంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

తాజాగా కీర్తి సురేష్ ప్రేమ‌యాణంకు సంబంధించిన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈమె గ‌త కొద్ది రోజులుగా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌తో ప్రేమాయ‌ణంలో ఉంద‌ని, త్వ‌ర‌లో వీరిరివురు పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌నున్నార‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రేమాయ‌ణంపై ఓ క్లారిటీ కూడా ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తుంది. అనిరుధ్ .. తెలుగుతో పాటు త‌మిళ సినిమా ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచ‌తం తెలుగులో ఆయ‌న నితిన్ న‌టించిన‌ అఆ సినిమాతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన అజ్ఞాత‌వాసి చిత్రానికి సంగీతం అందించాడు. ఇటీవ‌ల వచ్చిన గ్యాంగ్ లీడ‌ర్ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చి అల‌రించాడు. విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన మాస్ట‌ర్ సినిమాకు కూడా అనిరుధ్ సంగీతం అందించాడు. మ‌రి కీర్తి సురేష్‌, అనిరుధ్‌ల ప్రేమ‌, పెళ్ళికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.